సిటిజన్స్, రెసిడెన్సీలపై ట్రాఫిక్ ఫైన్స్ ప్రచారాన్ని ఖండించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- August 13, 2020
కువైట్: ట్రాఫిక్ చట్టాన్ని అనుసరించి పౌరులు, ప్రవాసీయులపై జరిమానాలు విధించారన్న ప్రచారాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖండించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జరిమానాలు విధించారంటూ ఇటీవలె సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఉద్దేశించి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుతం తమ అధికారిక వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నామని..అందువల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన విజువల్స్ తమకు అందుబాటులో లేవని కూడా స్పష్టం చేసింది. ఏదైనా విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత అధికారిక వర్గాల నుంచి కన్ఫమ్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖలోని పౌరసంబంధాలు, భద్రతా వ్యావహారాల సాధారణ విభాగం అధికారులు సూచించారు. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు తము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







