యూఏఈ కి తిరిగొచ్చే ప్రతి ఒక్కరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
- August 13, 2020
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఐసిఎ) యూఏఈ, దేశంలోకి తిరిగొచ్చేవారందరికీ 14 రోజుల క్వారంటైన్‌ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ తేలినా 14 రోజులు క్వారంటైన్‌లోనే వుండాల్సి వస్తుంది. తక్కువ రిస్క్ వున్న దేశాల నుంచి వచ్చే కొందరు ప్రొఫెషనల్స్‌కి మాత్రం పరిస్థితుల్ని బట్టి క్వారంటైన్ గడువుని వారం రోజులకు పరిమితం చేయనున్నారు. పబ్లిక్ హెల్త్‌ని కాపాడే క్రమంలో ఖచ్చితమైన రీతిలో చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రికాషనరీ మెజర్స్‌ని తప్పక అమలు చేయాల్సిందేనని అంటున్నారు అదికారులు. ‘ప్యూర్ హెల్త్ డాట్ ఎఇ’ అనే వెబ్సైట్ ద్వారా కరోనా వైరస్ టెస్టులకు సంబంధించిన ల్యాబ్‌ల వివరాలు అందుబాటులో వుంటాయనీ, వాటి నుంచి ప్రయాణానికి 96 గంటల లోపల కరోనా టెస్ట్ చేయించుకుని సర్టిఫికెట్ తెచ్చుకున్నవారినే ప్రయాణానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు