డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన సౌదీ పోలీసులు..107 కిలోల మత్తుపదార్ధాల స్వాధీనం
- August 13, 2020
రియాద్:సౌదీలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు జాసన్ పోలీసులు. ఓ వాహనంలో తరలిస్తున్న మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని ట్రంక్ ప్రాంతంలో నిషేధిత హషిష్ ను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర చేశారు. అయితే..వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు..డ్రగ్స్ తరలిస్తున్న వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో అసలు బాగోతం బయటపడింది. ఏకంగా 107 కేజీల నిషేధిత హషిష్ ను గుర్తించిన పోలీసులు..మత్తు పదార్ధాలను సీజ్ చేశారు. సౌదీ చెందిన వ్యక్తి వాహనం నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న తీరును బట్టి ఇది పక్కా స్మగ్లింగ్ గ్యాంగ్ పనే అని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సౌదీ చట్టాల మేరకు మత్తుపదార్ధాలు సరఫరాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?