బిచ్చం అడిగితే జరిమానా, జైలు శిక్ష తప్పవని హెచ్చరించిన ఒమన్
- August 13, 2020
మస్కట్:ఒమన్ లో బిచ్చం ఎత్తుకోవటం నిషేధమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. మసీదులు, స్టోర్స్, షాపింగ్ మాల్స్ తో పాటు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా డబ్బులు యాచిస్తే వారికి ఏడాది జైలు శిక్ష, omr100 జరిమానా తప్పదని హెచ్చరించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎవరైనా పబ్లిక్ ప్రాంతాల్లో బిచ్చం ఎత్తుకుంటే జైలు, జరిమానాతో పాటు వారి దగ్గర ఉన్న సొమ్మును కూడా జప్తు చేస్తామని, శిక్షా కాలం పూర్తైన తర్వాత ఆ వ్యక్తిపై దేశబహిష్కరణ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ బిచ్చం ఎత్తుకునే వ్యక్తి మైనర్ అయినా..మైనర్ తో కలిసి యాచించిన మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే మైనర్ తో బలవంతంగా బిచ్చం ఎత్తుకునేలా చేస్తే వారికి శిక్ష రెట్టింపు అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పౌరులు, ప్రవాసీయులు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?