హోం క్వారంటైన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ఖతార్

- August 13, 2020 , by Maagulf
హోం క్వారంటైన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ఖతార్

దోహా:అన్ లాక్ మూడో దశలో భాగంగా వివిధ దేశాల నుంచి ప్రవాసీయులకు అనుమతి ఇచ్చింది ఖతార్. లాక్ డౌన్ నిబంధనలతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు ఆగస్ట్ 1 నుంచే ఖతార్ వెళ్తున్నారు. అయితే..కరోనా ప్రభావ దేశాలను అనుసరించి..ఆయా దేశాల నుంచి వచ్చే వారి విషయంలో ఇప్పటికే క్వారంటైన్ గైడ్ లైన్స్ ను ప్రకటించిన ఖతార్..తాజాగా క్వారంటైన్ కొత్త మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. గతంలో వారం పాటు హోం క్వారంటైన్ ఉంటే సరిపోయేది.
కానీ, కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన హోటల్ లో తొలి వారం నిర్బంధంలో ఉండాలి. ఆ తర్వాత వారం పాటు హోం క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు..హోం క్వారంటైన్ సమయంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై క్లారిటీ ఇచ్చింది ఖతార్ ప్రభుత్వం. హోం క్వారంటైన్ లో ఉండే వ్యక్తి ప్రత్యేక బాత్రూం ఉన్న గదిలోనే ఉండాలి. ఇతర కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ కావొద్దని సూచించింది. అలాగే హోం క్వారంటైన్ లో ఉండే ప్రతి వ్యక్తి ఎతెరాజ్ యాప్ ను తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాలి. సదరు వ్యక్తి క్వారంటైన్ గడువులో యాప్ పసుపు రంగు కలర్ కోడ్ లో కనిపిస్తుంది. క్వారంటైన్ కాలం ముగిసిన తర్వాత అతనికి కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కలర్ కోడ్ గ్రీన్ కలర్ లోకి మారుతుంది. అంతేకాదు..అతిథులను కూడా ఇంటికి రానివ్వొద్దు. ఇంట్లోని ఆరోగ్యవంతులైన వ్యక్తి తగిన సంరక్షణ చర్యలతో క్వారంటైన్ లో ఉన్న వ్యక్తికి ఆహారం అందించాల్సి ఉంటుంది. అతని పాత్రలు, కప్పులు వేరుగా ఉంచటంతో పాటు రోజు తగినంత మంచినీరు తీసుకొని..తగినంత విశ్రాంతి తీసుకోవాలని ఖతార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com