ఆగస్ట్ 15న సరికొత్త థ్రిల్లర్ ''బ్లూ ఐస్'' ట్రైలర్ లాంచ్!!!
- August 13, 2020
డిజిటల్ వరల్డ్ లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఎగబడి చూసేస్తున్నారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ వండి చిత్రాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో విడుదల కాబోతోంది. ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ వంటి నటీనటులు నటించిన చిత్రం "బ్లూ ఐస్". ఈ చిత్ర ట్రైలర్ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది.
రాధా మాదవి ప్రొడక్షన్స్, రవళి చౌదరి సమర్పణలో మాదల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకుడు. సంగీతం ఎమ్.అనిరుధ్ అందించాడు. ట్రైలర్ ని కూడా రెడీ చేశారు. ఈ థ్రిల్లర్‌లో స్నేహితురాలు మర్మమైన పరిస్థితులలో చనిపోయినట్లు తెలుసుకున్న రోహిత్ హంతకుడిని తెలుసుకోవడానికి మోనికా సహాయం తీసుకుంటాడు. ఆమె, ఒక మనోరోగ వైద్యుడితో కలిసి, దారుణ హత్య రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సినిమాలో అసలు పాయింట్. సినిమాలో థ్రిల్లింగ్ గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇదివరకే కన్నడ రిలీజైన బ్లూ ఐస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక తెలుగు ఆడియెన్స్ ని కూడా థ్రిల్ చేయడానికి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నటీనటులు:
ఆఫ్రిన్ సిద్దు, నాస్తియా రాయ్, నిశాంత్ వాలియ, ఆర్జె పృద్వి తదితరులు
టెక్నీషియన్స్:
బ్యానర్: రాధా మాధవి ప్రొడక్షన్స్
నిర్మాత: మాదాల రామకృష్ణ
సంగీతం: ఎమ్.అనిరుద్
దర్శకత్వం: రాజేష్ మూర్తి
పిఆరోఓ: మధు.విఆర్
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







