సికింద్రాబాద్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే . భారీ అగ్నిప్రమాదం
- February 06, 2016
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్యాచీ ఫర్నీచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాకప శాఖకు చెందిన ఫైరింజన్లు సంఘటనాస్థలానికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి.ఈలోపు దుకాణంలోపల అగ్నికీలలు మరింత ఎగిసిపడటంతో మరికొన్ని ఫైరింజన్లను తెప్పించారు. మొత్తం 8 ఫైరింజన్లతో గంటలపాటు కష్టపడిన తర్వాతగానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో షాపులోని దగ్ధమైన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. కాగా ఎవరికి గాయాలైనట్లు సమాచారంలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్









