ఎస్పీ ఆరోగ్యం విషమం..ICUలో చికిత్స

- August 14, 2020 , by Maagulf
ఎస్పీ ఆరోగ్యం విషమం..ICUలో చికిత్స

చెన్నై:తాను కరోనా వైరస్ బారిన పడినట్లు ఆగస్టు 5 న ప్రముఖ గాయకుడు ఎస్పీబాలసుబ్రహ్మమణ్యం రెండు వారాల క్రితం ప్రకటించారు. వైరస్ లక్షణాలు తక్కువగా ఉన్నాయని త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ లైవ్ లో చెప్పారు. అయితే అనూహ్యంగా ఆయన ఆరోగ్యం దెబ్బతిందని చికిత్స పొందుతున్న ఎంజిఎం హెల్త్‌కేర్ నుండి ఒక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్‌లో ఉన్నారని, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అందులో పేర్కొన్నారు.

ఆసుపత్రి ప్రకటన ఈ విధంగా ఉంది..

'ఆగస్టు 5, 2020 నుండి COVID లక్షణాల కోసం MGM హెల్త్‌కేర్‌లో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యానికి ఎదురుదెబ్బ తగిలింది. 2020 ఆగస్టు 13 న అర్థరాత్రి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్యుల సలహా ఆధారంగా నిపుణులైన వైద్య బృందం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కి తరలించారు. అతని పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఎస్పీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యుల బృందం అతడిని నిశితంగా పరిశీలిస్తున్నారు. '

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com