IPL ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ క్రికెటర్లు దూరం

- August 15, 2020 , by Maagulf
IPL ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ క్రికెటర్లు దూరం

యూఏఈ:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభ దశ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు దూరంకానున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 16 మధ్య మూడు టీ 20లు, మూడు వన్డేల్లో ఆసిస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్ ల కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు యూఏఈలో జరిగే ఐపీఎల్ -13 కోసం వారం రోజులు ఆలస్యంగా తమ తమ జట్లతో కలవనున్నారు. ఐపీఎల్ 8 జట్లలో రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు మొత్తం 29 మంది ఉన్నారు. ఒక్క ఆసిస్ నుంచే 12 మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరమయ్యే అవకాశం ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com