ఏపీలో కొత్తగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు...

- August 15, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు...

అమరావతి:ఏ.పీ‌లో కొత్తగా మరో 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 87 మంది మృతి చెందారు. 

గడిచిన 24 గంటల్లో 53,712 కరోనా టెస్టులు చేయగా... మొత్తం టెస్టుల సంఖ్య 28,12,197కి చేరింది. తాజాగా మరో 10,414 మంది క‌రోనా నుంచి కోలుకుని కోవిడ్ 19 ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 1,91,117 మంది డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 88,138 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా,ఇటీవల ఏ.పీ‌లో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ 82971 04104 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. కరోనా సోకితే కనిపించే లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పరీక్షల వివరాలను హెల్ప్ లైన్ ద్వారా వివరించనున్నారు. కరోనా సోకితే ఎవరిని సంప్రదించాలి... ఏం చేయాలన్న సందిగ్ధం ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో ఈ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com