ప్రపంచానికి భారత్ మార్గ నిర్ధేశం చేస్తుంది: గవర్నర్
- August 15, 2020
హైదరాబాద్:స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించి, శుభాకాంక్షలు తెలిపారు.
భారత మిలిటరీకి చెందిన వివిధ అధికారులు, ఎక్స్ సర్వీస్ మెన్, అమర జవాన్ల కుటుంబ సభ్యులు, క్రీడాకారులు, కోవిడ్ యోధులు, సాహితీ, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో గవర్నర్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎందరో బలిదానాలు, త్యాగాలు, ఉద్యమాల ద్వారా, గొప్ప అహింసాయుత స్వాతంత్య్ర పోరాటం ద్వారా మన దేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో భారత్ ఒక పేద దేశమని, భిన్నత్వం, వైరుధ్యాలున్నాయని, అభివృద్ధి చాలా కష్టమన్న అపోహలుండేవి.
ఐతే గత ఏడు దశాబ్ధాలలో భారత్ అనేక రంగాలలో గొప్ప అభివృద్ధిని సాధించిందని, ఒక బలమైన ప్రపంచ శక్తిగా ఎదిగిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ఒక గొప్ప బలమైన శక్తిగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నదని, ప్రపంచ దేశాలు భారత్ ను ఒక నమ్మకమైన భాగస్వామిగా గుర్తిస్తున్నాయని గవర్నర్ స్పష్టం చేశారు.ఐటి రంగంలో, అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు, శాటిలైట్ సామర్ధ్యంలో, ఫార్మా రంగంలో, రక్షణ రంగంలో, వైద్యం, విద్య, మిస్సైల్ టెక్నాలజి, ఎనర్జీ, మౌళిక వసతులు, తదితర రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు.
130 కోట్ల జనాభాతో కూడా ఎలాంటి ఆహార కొరత లేకుండా, ఆహార రంగాలలో స్వయం సంమృద్ధిని సాధించిందని, గ్రీన్ రివల్యూషన్, వ్యవసాయ అభివృద్ధి చర్యలు ఈ ఘనతను సాధించడానికుపకరించాయని డా. తమిళిసై వివరించారు.
భారత్ అన్ని రంగాలలో స్వయం సమృద్ధిని, స్వయం ఆధారితను సాధించడానికి ప్రధాని మోడీ 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గవర్నర్ వివరించారు.
కోవిడ్ పై పోరులో నరేంద్ర మోడీ నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతులో భారత్ సమర్ధవంతంగా ఉందన్నారు.త్వరలోనే హైదరాబాద్ నుండి భారత్ కు తొలి కోవిడ్ వ్యాక్సిన్ రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దేశానికి 40 శాతం ఔషదాలను హైదరాబాద్ సమకూరుస్తున్నదని డా. తమిళిసై వివరించారు.యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి, దేశ సేవతో ప్రపంచంలో భారత్ ను గొప్ప దేశంగా తీర్చిదిద్దాలి అన్నారు.భారత దేశం యువతరం మెజారిటీగా ఉన్న దేశమని, ప్రపంచాన్ని లీడ్ చేసే సత్తా ఉందని, రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు.స్వాతంత్య్ర సమరయోధులు అనేక త్యాగాలతో మనకు స్వాతంత్య్రం తెచ్చారు, వీర సైనికుల త్యాగాలు పోరాటాలతో మనం సురక్షితంగా ఉన్నాం. వారి గొప్పతనాన్ని గుర్తించాలి, గౌరవించాలి, దేశ సేవలో పునరంకితం కావాలి.
తాను ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించనందుకు బాధపడ్డాను కాని ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సంభాషించినందుకు ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో భారత్ తొలి అంతరిక్ష యాత్రికుడు వింగ్ కమాండర్ రాకేష్ శర్మ, కార్గిల్ అమర సైనికుడు మేజర్ పద్మపాణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య, గాల్వాన్ లోయ అమరుడు కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, కల్నల్ నర్సింగరావు, కెప్టెన్ సాయికుమారు, మేజర్ భరత్ కుమార్, బ్రిగేడియర్ సురేష్ కుమార్ పటేల్ మిలటరీ నుండి పాల్గొన్నారు.స్వాతంత్య్ర సమరయోధుల తరపున సర్ధార్ జమలాపురం కేశవరావు తనయుడు డా. హరగోపాల్, ఉన్నం వెంకయ్య, యం. వెంకటరావు పాల్గొన్నారు.క్రీడారంగం నుండి బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పివి సిందు, రైఫిల్ షుటర్ శ్రీకాంత్, రిచాసింగ్, టైబుల్ టెన్నిస్ క్రీడాకారుడు స్నేహిత్, సాయి ప్రణీత్, ఆకుల శ్రీజ, స్కేటింగ్ చాంపియన్ కావ్య షా పాల్గొన్నారు.కోవిడ్ యోధుల రంగం నుండి భారత్ బయోటెక్ కు చెందిన యేల్లా సుచిత్రా, హెటిరో డ్రగ్స్ కు చెందిన పార్ధసారధి రెడ్డి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాజారావు, ఆయుర్వేదిర్ హాస్పిటల్ నుండి పరమేశ్వర నాయక్ పాల్గొన్నారు.సాహిత్య, సాంస్కృతిక రంగాల నుండి ఒగ్గు రవి, డా. అలేఖ్య పుంజాల, పెన్నా మధుసూదన శర్మ, డా.వి.త్రివేణి, డా.సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?