రోల్ రైడా ''నాగలి'' ర్యాప్ మ్యూజిక్ వీడియో కి అద్భుత స్పందన
- August 15, 2020
ర్యాప్ మ్యూజిక్ లో తనదైన ముద్ర వేసిన సింగర్ రోల్ రైడా తెలుగు మ్యూజిక్
లవర్స్ కు పరిచయమే. బిగ్ బాస్ కార్యక్రమం అతనికి ప్రతి ఇంటా గుర్తింపు
తెచ్చింది. తాజాగా రోల్ రైడా నాగలి అనే ర్యాప్ మ్యూజిక్ వీడియో చేశాడు.
అమిత్ తివారీ నటించిన ఈ మ్యూజిక్ వీడియో ఆగస్టు 14 విడుదల అయ్యింది.. ఈ
వీడియో టీజర్ ఆగస్టు 1న రోల్ రైడా అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్
చేశారు. ఏడ నుంచి వచ్చావు రైతన్నో, ఎడకెల్లి పోయావు రైతన్న...అని సాగే ఈ
పాట టీజర్ కు సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
రాహు చిత్రంలో ఏమో ఏమో ఏమో అంటూ సూపర్ హిట్ సాంగే కంపోజ్ చేసిన ప్రవీణ్
లక్కరాజు నాగలి ర్యాప్ మ్యూజిక్ వీడియోకు సంగీతాన్ని అందించారు.
కరువు తాండవించే నేలలో సేద్యం చేసేందుకు శ్రమించే రైతును, ఆ వర్షం కూడా
మోసం చేస్తే, చెప్పుకునే దిక్కులేక దిక్కులన్నీ వినిపించేలా రోదిస్తాడు.
కోపంతో నాగలి అదే నేల మీద పడేస్తాడు. పేదరికమనే మంటల్లో ఇల్లు తగలబడి
పోతుంటే నిస్సహాయుడై నిలబడతాడు. ఊరి చివర మర్రి చెట్టే ఊరి కొయ్యగా మారి
ప్రాణాలు వదిలేస్తాడు. ఇలా రైతు కష్టాలను ప్రతిబింబిస్తూ సాగుతుందీ
వీడియో. టీజర్ లో అమిత్ చూపించిన ఏమోషన్స్ సగటు రైతు బాధను చూపిస్తాయి.
మండే గుడిసె బ్యాక్ గ్రౌండ్ లో రోల్ రైడా ఎంట్రీ వీడియో ఇంటెన్సిటీ
పెంచింది.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ వీడియో రైతులపై ప్రేమ ను,
గౌరవాన్ని ప్రతిబింబించింది.
అమిత్ రైతు జీవితంలో భావోద్వేగాలను అద్భుతం గా పలికించాడు. రోల్ చేసిన
ప్రవేట్ వీడియో సాంగ్స్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది..
గూస్ బంప్స్ తెప్పించే నాగలి మ్యూజిక్ వీడియో అజయ్ మైసూర్ సమర్పణలో కాలా
మోషన్ పిక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మితమైంది. హరికాంత్
గుణమగారి దర్శకత్వం వహించారు. అజయ్ మైసూర్ నిర్మాతగా, ధాత్రి అమ్మనబోలు
సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ వీడియోకు డీవోపీ - ఎదురోలు రాజు, ఆర్ట్ -
డెరెక్టర్ చంద్రిక, లైన్ ప్రొడ్యూసర్స్ - నీల చక్రవర్తి
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?