థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేమకథ భిక్ష
- August 16, 2020
హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఓ అందమైన ప్రేమకథా చిత్రంగా 'భిక్ష' రూపొందిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. విహాన్ క్రియేషన్స్ సమర్పణలోకార్తీక్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రంజిత్ రాజకొండ, తేజేశ్వర్ రెడ్డి, భరత్ మహేశ్వరం, సిదార్థ స్వరూప్, ప్రియాంశ, అనోన్య, ప్రియ ప్రధాన తారాగణం. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలీ హీరోగా 'తిన్నామా పడుకున్నామా తెల్లారిందా', ఇంకా 'అంతా వి చిత్రం' చిత్రాలకి దర్శకత్వం వహించిన రామ్ కుమార్ భిక్ష చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
''ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. అనంతపురం, జగిత్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని'' నిర్మాత వడ్ల గురురాజ్ తెలిపారు. ''శ్రీపాల్ అనే సంగీత దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే ఆయన ఐదు పాటలకు బాణీలు ఇచ్చారని'' చెప్పారు.
''కరోనా కాలమైనప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తామని'' దర్శకుడు రామ్ కుమార్ తెలిపారు.
ఈ చిత్రంలో ఇంకా వెంకటేశ్ తాతిరాజు, మల్లాది శాస్త్రి, శీలం శ్రీను, మాస్టర్ కుషాల్ రెడ్డి, మాస్టర్ హర్ష తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: జియోలక్ష్ణణ్, ఛాయాగ్రహణం: టి.సురేందర్ రెడ్డి, పాటలు: పి. నాగేంద్ర ప్రసాద్, కో ప్రొడ్యూసర్: అచ్చపు శ్రీనివాసులు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?