కువైట్:క్షమాభిక్ష వినియోగించుకోని 1,20,000 మంది ప్రవాసీయులు

- August 16, 2020 , by Maagulf
కువైట్:క్షమాభిక్ష వినియోగించుకోని 1,20,000 మంది ప్రవాసీయులు

కువైట్ సిటీ:వీసా గడువు ముగిసిన ప్రవాసీయులు కువైట్ లో ఇంకా 1,20,000 మంది ఉన్నారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసినా..ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఉచితంగా స్వదేశాలకు వెళ్లేలా కువైట్ ప్రభుత్వం ప్రవాసీయులు అవకాశం కల్పించింది. అయితే..ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోని ప్రవాసీయులు దేశంలో లక్ష 20 వేల మంది ఉన్నట్లు లెక్క తేల్చింది. వాళ్లందర్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా
హెచ్చరించింది. రెసిడెన్సీ వీసా నిబంధనలు ఉల్లంఘించి అనుమతించిన గడువుకు మించి దేశంలో ఉన్న ప్రవాసీయులందర్ని అరెస్ట్ చేస్తామని, అలాగే గడువు దాటి అదనంగా ఉన్న రోజులకు ఒక్కరికి గరిష్టంగా KD 600 జరిమానా విధిస్తామని వెల్లడించింది. క్షమాభిక్ష అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని ప్రవాసీయులపై దేశ బహిష్కరణ విధిస్తామని..వాళ్లు స్వదేశాలకు వెళ్లేందుకు స్పాన్సర్లే విమాన ఛార్జీలు భరించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అయితే..క్షమాభిక్ష అవకాశాన్ని వినియోగించుకోని వారిలో ఎక్కువ మంది కార్మికులే ఉన్నారని, వాళ్లంతా వీసా ట్రేడర్స్ మోసాలతో కువైట్ వీధుల్లో వదిలివేయబడినవారే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com