షార్జాలోని 16 మాల్స్ లో ఉచితంగా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు
- August 17, 2020
షార్జా:షార్జా పరిధిలో వీలైనంత ఎక్కువ మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ఉచిత కోవిడ్-19 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. షార్జా పోలీసుల సాయంతో ఆరోగ్య శాఖ అధికారులు ఉచితంగా కోవిడ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఎమిరాతి పరిధిలోని మొత్తం 16 కేంద్రాల్లో తాత్కాలిక కోవిడ్ టెస్ట్ సెంటర్లను షార్జాలోని పలు షాపింగ్ మాల్స్ లో ఈ తాత్కాలిక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఓ కేంద్రాంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలా ఒక్కో రోజులో రెండు కేంద్రాల చొప్పున 8 రోజుల్లో 16 షాపింగ్ మాల్స్ లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో సెంటర్లో 600 మంది వరకు టెస్టులు నిర్వహిస్తారు. రోజుకు 8 గంటల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. షాపింగ్ కు వచ్చే జనాలు ఉత్సాహంగా పరీక్షలు నిర్వహించుకునే అవకాశాలు ఉన్నందునే మాల్స్ లో కోవిడ్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్క సారి శాంపిల్స్ తీసుకున్న తర్వాత 48 గంటల్లో రిజల్ట్ ఇస్తారు. ఫోన్ నెంబర్ కి ఎస్ఎంఎస్ ద్వారాగానీ, లేదంటే అల్ హోస్న్ యాప్ ద్వారా గానీ టెస్ట్ రిపోర్ట్స్ కు సమాచారం అందిస్తారు.
ఇదిలాఉంటే ఇప్పటివరకు నాలుగు రోజులుగా 8 కేంద్రాల్లో ఉచితంగా కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇక ఈ రోజు అల్ క్వోజ్‌లోని మాతాజెర్ సెంటర్, అల్ గెరెమా ప్రాంతంలోని మాతాజెర్ సెంటర్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం- అల్ బుహైరా సమీపంలోని లులు సెంటర్, రమేజ్ సెంటర్...బుధవారం - అల్ బుటినాలోని నెస్టో సెంటర్, గోల్డ్ మార్కెట్ సెంటర్.....గురువారం- జీరో 6 మాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. మరో కేంద్రం వివరాలను తర్వాత ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!