తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

- August 17, 2020 , by Maagulf
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

విశాఖపట్నం:వర్షం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు అధికారులు ప్రకటించారు. చత్తీస్‌గడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి చెదురు మదరుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు. అలాగే ఈనెల 19న ఉత్తర బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఇదిలాఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాజెక్టులకు వరద పోటు ఎక్కువగా ఉండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com