సంపత్‌నంది కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్‌తో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం
- August 17, 2020
హైదరాబాద్:ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంబించారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ``మా బ్యానర్లో ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు సంపత్‌నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ ఫస్ట్‌వీక్ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. సంపత్‌నంది అసోసియేట్ డైరెక్టర్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించి ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుంది. అనూప్ క్రియేటివ్స్ సంగీతం అందిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ప్రవీణ్ అనుమోలు,
సంగీతం: అనూప్ క్రియేటివ్స్,
సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్,
నిర్మాత: కె.కె. రాధామోహన్,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సంపత్‌నంది,
దర్శకత్వం: అశోక్ తేజ.

తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







