వినాయక చవితి ఉత్సవాలపై తెలంగాణ ప్రభత్వం కీలక నిర్ణయం
- August 17, 2020
హైదరాబాద్: గణేష్ ఉత్సవ మండపాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలోఈ వినాయకచవితికి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెహర్రం, వినాయకచవితి కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో జరగనివ్వమని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వినాయక పూజలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.
మట్టి విగ్రహాలను తెచ్చుకుని పూజించాలని, 5 అడుగుల ఎత్తులోపు ఉండాలని పలు చోట్ల గణేష్ ఉత్సవ కమిటీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. భారీ విగ్రహాలు, సెట్టింగ్‌లు ఏర్పాటు చేయవద్దని గణేష్ ఉత్సవ కమిటీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు అందాయి. పూజలో అర్చకునితో పాటు ఒక జంట దంపతులు మాత్రమే కూర్చోవాలని గణేష్ ఉత్సవ కమిటీలు భక్తులకు సూచన చేశాయి.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









