ఏపీ:3 లక్షలకు చేరువలో కరోనా కేసులు
- August 17, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో (9am-9am) రాష్ట్రవ్యాప్తంగా 6,780 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,609కి చేరింది. గత 24 గంటల్లో 44,578 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 29.05లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,777 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 2,09,100 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అవ్వగా.. కొవిడ్‌తో తాజాగా 82 మంది మృతి చెందారు. మొత్తంగా 2,732 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో పదమూడు మంది; తూర్పు గోదావరి జిల్లాలో పది మంది; చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది; గుంటూరు, కడప జిల్లాల్లో ఏడుగురు; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు; అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు; కృష్ణా జిల్లాలో ముగ్గురు; నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం