42 ఆన్‌లైన్‌ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌

- August 18, 2020 , by Maagulf
42 ఆన్‌లైన్‌ సర్వీసుల్ని ప్రారంభించిన సౌదీ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌

రియాద్‌: సౌదీ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ లతీఫ్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ అషెఖ్‌, సోమవారం 42 డిజిటల్‌ సర్వీసులు అలాగే ఏడు ప్రొసిడ్యురల్‌ సిస్టమ్స్ ప్రారంభించారు. మినిస్ట్రీ పోర్టల్‌ ద్వారా మరిన్ని సౌకర్యాల్ని ఈ క్రమంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లయ్యింది. ఈప్రాజెక్ట్‌, ఇండికేటర్స్‌ పెర్ఫామెన్స్‌ని మానిటర్‌ చేస్తుంది. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఐటీ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా మినిస్టర్‌ కొనియాడారు. మినిస్టర్‌కి ఈ సర్వీసులు, కొత్త సిస్టమ్స్ గురించి వివరించారు అధికారులు. ఉద్యోగుల పెర్ఫామెన్స్‌ని కూడా ఈ కొత్త సిస్టమ్స్ పెంచుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com