కరోనా బాధితులకు ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించిన సీపీ మహేష్‌భగవత్
- August 18, 2020
హైదరాబాద్: కరోనా బారినపడిన వారిని ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించడానికి ఉచిత అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయక్తంగా ఉంటాయని రాచకొండ పోలీస్ కమీషనర్
మహేష్ భగవత్ అన్నారు. కరోనాతో లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అంబులెన్స్‌లో ఆసుపత్రికి ఉచితంగా చేరడానికి కమిషనరేట్‌లో లైఫ్‌లైన్ సేవల్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఇందు కోసం ఏర్పాటు చేసిన రెండు అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో డబ్బులు చెల్లించలేని వారికి కోసం, అనారోగ్యంతో లేదా వయసురీత్యా కాలు బయట పెట్టలేని వారి కోసం ఇవి చాలా ఉపయోగపడతాయన్నారు. కమిషనరేట్ నుంచి 24గంటలు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అవసరమున్న వారు ఫోన్ 94906 17234, 94906 17111లో సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!