యూఏఈ నుంచి విమాన ప్రయాణానికి కోవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి

- August 18, 2020 , by Maagulf
యూఏఈ నుంచి విమాన ప్రయాణానికి కోవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి

యూఏఈ:యూఏఈ వచ్చేందుకే కాదు..యూఏఈ నుంచి విమాన ప్రయాణం చేయాలన్నా ఇక నుంచి కోవిడ్ 19 పీసీఆర్ నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఈ మేరకు యూఏఈలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలకు నోటీసులు అందాయి. ఇక నుంచి షార్జా, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు చెక్ ఇన్ కౌంటర్ దగ్గర కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ ను విధిగా చూపించాల్సి ఉంటుంది. విమానం బయల్దేరే సమయానికి 48 గంటల లోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే అనుమతిస్తారు. షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు నడిపించే విమానయాన సంస్థలకు షార్జా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఈ మేరకు సమాచారం అందించింది. అలాగే అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కూడా రెండు విమానయాన సంస్థలకు కోవిడ్ 19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని తెలుపుతూ సమాచారం అందించింది. దీంతో యూఏఈ పౌర విమానయాన సంస్థ ఎతిహాద్ గత బుధవారమే తమ ప్రయాణికులకు ఆర్టీ పీపీఆర్ టెస్ట్ ఫలితాలకు సంబంధించి సమాచారం అందించింది. తమ సర్వీసుల్లో ప్రయాణం చేయాలంటే ప్రయాణ సమయానికి 96 గంటల్లో తీసుకున్న కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కాపీ ఖచ్చితంగా చూపించాలని ప్రయాణికులను కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com