నృత్య కళాకారిణిగా శ్రుతిహాసన్
- August 19, 2020
హైదరాబాద్:ఎస్పీ జననాధన్ దర్శకత్వం వహిస్తున్న ‘లాభం’ చిత్రంలో అందాల భామ శ్రుతిహాసన్ గ్రామీణ నృత్యకళాకారిణి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌సేతుపతి, పి.ఆర్ముగకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి సంఘసేవకుడిగా నటిస్తున్నారని, అతడి సేవలను చూసి మెచ్చుకుని శ్రుతి హాసన్ ప్రేమలో పడుతుందని ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే మిగిలిన కథాంశమని దర్శకుడు ఎస్పీ జననాథన్ తెలిపారు. లాక్డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ చేస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







