ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ అధికారులకు అత్యంత ఆధునిక ట్యాబ్లు: డి‌జి‌పి గౌతం సవాంగ్

- August 19, 2020 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ అధికారులకు అత్యంత ఆధునిక ట్యాబ్లు: డి‌జి‌పి గౌతం సవాంగ్
నిస్సహాయులకు ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది పోలీస్...  అటువంటి పోలీసుల నుంచి సామాన్యులకు మెరుగైన సేవలు అందాలి.. అది అందాలంటే పోలీసుల పనితీరులో నాణ్యత పెరగాలి.. నేరాలు తగ్గాలంటే శిక్షలు పెరగాలి... తప్పించుకోకుండా ఉండాలంటే తగిన ఆధారాలు సమర్పించాలి.... మహిళలు ధైర్యంగా బయటకి రావాలంటే ఆకతాయిల మొదలుకొని మృగాళ్ళ వరకు అదుపు చేయాలంటే అందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందే... మహిళలు చిన్నారులు సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం అమలుపరచడం లో భాగంగా అందుకు అనుగుణంగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను రాష్ట్రంలోని ప్రతి క్షేత్రస్థాయి అధికారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS అందజేశారు.
ఈ‌ సంధర్భంగా డి‌జి‌పి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ టెక్నాలజీ వినియోగంలో  దేశంలోనే  అగ్రగామిగా కొనసాగుతుందని ఇప్పటికే జాతీయ స్థాయి లో  26 అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సొంతం చేసుకుందని..ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకువచ్చిన  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు  వీడియో కాన్ఫరెన్స్  సౌకర్యం, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా  రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వెహికల్స్ (రేస్) విధానం,  నిరంతర నిఘా  కోసం డ్రోన్‌ల నుండి  ప్రత్యక్ష ప్రసారం, అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు, ఇప్పటికే అందుబాటులో లైవ్ స్ట్రీమింగ్ (BWC) కెమెరాల పరికరాలు, ప్రజల కోసం సురక్ష,  స్పందన మరియు దిశా మొబైల్ అప్లికేషన్స్ తోపాటు...సిబ్బంది కోసం  APCOPS మొబైల్ పోలీస్ అప్లికేషన్ (e-Hunt. Frs.  క్రైమ్  అనలిటిక్స్, PIS, కోర్టు క్యాలండర్).  పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు & మ్యాన్‌ప్యాక్‌లు) సేవలకు అదనంగా CCTNS, ICJS, DISHA, LHMS, PINS, FINGER PRINTS,FORENSIC కు చెందిన సమగ్ర  సమాచారాన్ని ఈ ట్యాబ్ లో పొందుపర్చడం జరిగిందని దీని ద్వారా ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన  సేవలు  అందించేందుకు  క్షేత్రస్థాయి అధికారికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి‌జి రవి శంకర్ అయ్యన్నార్, అడిషనల్ డి‌జి హరీష్ కుమార్ గుప్తా,సి‌ఐడిే అడిషనల్ డి‌జి పి.వి.సునిల్ కుమార్  వెల్ఫేర్ అడిషనల్ డి‌జి శ్రీధర్ రావు, టెక్నికల్ డి‌ఐజి పాలరాజు తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com