అనుష్క 'నిశ్శబ్దం' ఓటీటీలోనే!
- August 19, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఐదు నెలలుగా సినిమా హాళ్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో ఒక్కొక్కటిగా సినిమాలు ఓటీటీ నెట్వర్క్ లో విడుదల అవుతున్నాయి. ఇటీవల నాని నటించిన 'వి' సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుందని సమాచారం వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'నిశ్శబ్దం' సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమాను ఎప్పుడో ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నించినా, అనుష్క అభ్యంతరం చెప్పింది. దీంతో ఇన్ని రోజులు విడుదలకు నోచుకోలేదు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ తో అప్పుడే డీల్ కూడా ఓకే అయ్యిందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఎక్కడ రిలీజ్ చేయాలని కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నిర్మాత కోన వెంకట్ ఓ ఆన్ లైన్ పోల్ నిర్వహించారు. అందులో 56 శాతం మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నామని తెలిపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. మాధవన్, అంజలి, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వా ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం