గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన సంజనరెడ్డి
- August 19, 2020
హైదరాబాద్:గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అపురూపంగా ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో వర్షాలు జోరుగా పడుతుండటంతో మొక్కలు నాటడం ఒక పండగల నడుస్తుంది.
గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన టాలీవుడ్ లేడీ డైరెక్టర్, కరణం మల్లీశ్వరి బయోపిక్ మూవీని డైరక్ట్ చేయబోతున్న సంజనరెడ్డి ఈ రోజు సోమజిగూడలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.ఎంపీ సంతోష్ నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చూసి స్వతహాగా ఈ రోజు గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యారు సంజనరెడ్డి.గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం తనకు చాలా ఆనందంగా ఉందనీ, ఇంత మంచి కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరికి,హీరో రాజ్ తరుణ్,సినీ రచయిత కోన వెంకట్,హీరోయిన్ ఐశ్వర్య అర్జున్,సందీప్ చితుకుల కు తలా మూడు మొక్కలు నాటల్సిందిగా కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..