తెలంగాణలో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో గత 24 గంటల్లో 23,841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1724 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఈ మేరకు గురువారం ఉదయం వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కరోనా వైరస్‌తో కొత్తగా 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 729కు పెరిగింది. కాగా బుధవారం కొత్తగా 1195 మంది కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 75,186కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 8,21,311మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 77.17శాతం ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









