మనీలాండరింగ్ రాకెట్‌ని భగ్నం చేసిన సౌదీ పోలీస్
- August 20, 2020
రియాద్: రియాద్ పోలీస్, ఎనిమిది మంది సభ్యులుగల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. విదేశాలకు డబ్బుని అక్రమంగా తరలిస్తున్నట్లు ఈ ముఠాపై అభియోగాలు మోపబడ్డాయి. ముగ్గురు సౌదీలు, ఐదుగురు సుడానీలు ఈ గ్యాంగ్‌లో వున్నారు. 500 మిలియన్ రియాల్స్‌కి పైగా డబ్బుని అక్రమంగా విదేశాలకు నిందితులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు రియాద్ పోలీస్ అసిస్టెంట్ స్పోక్‌పర్సన్ మేజర్ ఖాలెద్ అల్ క్రెదిస్ చెప్పారు. ఈ ముఠా గురించి సమాచారం అందడంతో, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ని ప్రారంభించి, నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి రిఫర్ చేయడం జరిగింది. వీరిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









