భారత్:ఒక్కరోజే 68 వేల కేసులు, 983 మరణాలు
- August 21, 2020
న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల రోజురోజుకూ అధికమవుతోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 68,898 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 983 కోవిడ్ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 54,849 కు చేరింది. తాజాగా 62,282 కరోనా పేషంట్లు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.3 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. భారత్లో పాజిటివిటీ రేటు 8.54 శాతంగా ఉందని వెల్లడించింది. తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో 61 శాతం, మొత్తం మరణాల్లో 75 శాతం 5 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని తెలిపింది. అవి.. మహారాష్ట్ర, ఏ.పి, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసుల చూస్తే భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు