భారత్‌లోని 5 నగరాలకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ రిపాట్రియేషన్ విమానాలు
- August 21, 2020
దుబాయ్: దుబాయ్ ప్రధాన క్యారియర్ అయిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ భారతదేశంలోని 5 నగరాలకు రిపాట్రియేషన్ విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి 31వ తేదీ మధ్య ఇండియాలోని బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఈ ప్రత్యేక విమానాలు యూఏఈలోని భారత పౌరులు ఎవరైతే స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారిని తరలించడానికి, అలాగే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యూఏఈ నివాసితులు తిరిగి ఆ దేశానికి రావడానికి వీలు కల్పిస్తాయని ఈ విమానయాన సంస్థ పేర్కొంది.
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సర్వీసుల వివరాలు...
బెంగళూరు: ఆగస్టు 21, 23, 25, 28, 30
కొచ్చి: ఆగస్టు 20, 22, 24, 27, 29, 31 (కొచ్చి నుంచి దుబాయ్‌కు నడిచే విమానాలు ఆగస్టు 21, 23, 25, 28, 30, సెప్టెంబర్ 1న ఉంటాయి.)
ఢిల్లీ: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు
ముంబై: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు
తిరువనంతపురం: ఆగస్టు 26 (తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లే విమానం ఆగస్టు 27న ఉంటుంది.)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన