ఎస్బీఐ ప్రవేశపెట్టిన డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్
- August 22, 2020
న్యూ ఢిల్లీ:కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది ఏటీఎంలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక చాలా చోట్ల ఏటీఎంలలో నగదు నిల్వలు లేక వినియోగదారులకు నగదు లభించడం లేదు. అయితే ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఎస్బీఐ కొత్తగా డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల ఎస్బీఐ ఖాతాదారులు కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్ లేదా ఫోన్ కాల్ చేస్తే చాలు.. మొబైల్ ఏటీఎం వారి ఇళ్ల వద్దకే వస్తుంది. అందులో నుంచి వారు సులభంగా నగదు తీసుకోవచ్చు.
అయితే ఎస్బీఐ ప్రవేశపెట్టిన డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ ప్రస్తుతం లక్నోలో మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని అక్కడ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. విజయవంతం అయితే దేశవ్యాప్తంగా ఈ సేవను తన కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఎస్బీఐ భావిస్తోంది. ఈ విధానం ద్వారా కస్టమర్లు ముందుగా ఎస్బీఐకి చెందిన 7052-911-911 అనే నంబర్‌కు వాట్సాప్‌లో తమ ఇంటి చిరునామా పంపించాలి. లేదా ఈ నంబర్‌కు కాల్ చేసి కూడా చెప్పవచ్చు. దీంతో ఎస్బీఐ సిబ్బంది మొబైల్ ఏటీఎంను కస్టమర్ ఇంటికి తీసుకువస్తారు. అందులో నుంచి సులభంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
కాగా ఎస్బీఐ ఇటీవలే తన సేవింగ్స్ ఖాతాదారులకు మినిమం బ్యాలెన్స్ చార్జీలను తొలగించింది.అలాగే బ్యాంకింగ్ లావాదేవీలకు పంపించే ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు వసూలు చేసే చార్జీలను కూడా తీసేసింది. ఇక ఇప్పుడు తాజాగా డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సేవ త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?