రెండేళ్లలో కోవిడ్-19 పూర్తిగా అంతమవుతుంది:
- August 22, 2020
జెనీవా:ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న కరోనా మహమ్మారి మరో రెండేళ్లలో పూర్తిగా అంతమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అన్నారు. 1918లో వచ్చిన ఫ్లూ కన్నా తక్కువ సమయంలోనే కరోనాను అంతం చేస్తామని అన్నారు. కోవిడ్ 19 లాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. అందువల్ల కరోనాతో భయపడాల్సిన పనిలేదన్నారు.
1918లో ఫ్లూ వ్యాధి ఎక్కువ కాలం పాటు ఉందని, కానీ కరోనాను 2 ఏళ్లలోనే పూర్తిగా అంతం చేస్తామని, దానికి తగిన టెక్నాలజీ ప్రస్తుతం మన దగ్గర ఉందని అన్నారు. 1918లో ప్రపంచీకరణ ప్రభావం లేదని, అందువల్ల కేవలం కొన్ని దేశాలకే ఆ మహమ్మారి పరిమితమైందన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచీకరణ ఎక్కువగా జరిగిందని, అందువల్ల అన్ని దేశాలకూ కరోనా చాలా వేగంగా విస్తరించిందని అన్నారు. మరో 2 ఏళ్లలో కరోనాను పూర్తిగా అంతం చేస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు.
1918లో ఫ్లూ వ్యాధి 3 వేవ్‌లలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్త ఎమర్జెన్సీస్ చీఫ్ డాక్టర్ మైకేన్ ర్యాన్ అన్నారు. అయితే కోవిడ్ 19 కూడా సరిగ్గా అలాగే వస్తుందని చెప్పలేమని, ఎందుకంటే అప్పుడు లేని టెక్నాలజీ ఇప్పుడు ఉందని, కనుక కోవిడ్‌ను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణంగా వైరస్‌లు సీజన్లకు అనుగుణంగా వ్యాప్తి చెందుతాయని, కరోనా వైరస్ అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?