ప్యాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 3 స్థానం దక్కించుకున్న విజయ్ దేవరకొండ
- August 22, 2020
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన
పనిలేదు.యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
తెలుగులోనే కాదు నేషనల్ లెవల్ లో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు.రీసెంట్
గా ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్
హీరోగా రికార్డు కొట్టిన విజయ్ ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు.
ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్ ల లిస్ట్ లో విజయ్ ఏకంగా మూడు
స్థానం దక్కించుకోవడం విశేషం.మొదటి స్థానంలో షాహిద్ కపూర్,,రెండో స్థానం
లో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్
మూడో స్థానం సొంతం చేసుకున్నాడు.
ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా వరుసగా 2018,2019
సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు
ప్యాన్ ఇండియా లెవెల్ లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్ కు
నిదర్శనం. అతను చేసిన సినిమాలకు ,తన అటిట్యూడ్ కు నేషనల్ వైడ్ గా
ఫ్యాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ
చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో
దేశవ్యాప్తంగా ఆ సినిమా పై భారీ అంచనాలున్నాయి
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







