డిజిటల్ పౌర గుర్తింపు కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోలేదు..కువైట్ క్లారిటీ
- August 23, 2020
కువైట్ సిటీ:పౌరుల గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేస్తున్న కువైట్ ప్రభుత్వం..డిజిటల్ సివిల్ ఐడీల జారీపై ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి సంబంధించి స్పష్టత ఇచ్చింది. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. అయితే..ప్రస్తుతం కొత్త దరఖాస్తులను మాత్రం స్వీకరించటం లేదని కూడా వెల్లడించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల కారణంగా కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు గత శుక్రవారమే కువైట్ పౌర సమాచార అధికార విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది డిజిటల్ సివిల్ ఐడీల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాళ్లందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఇదిలాఉంటే..డిజిటల్ గుర్తింపు కార్డులను కువైట్ పౌరులు అందరూ తీసుకోవాలని..డిజిటల్ ఐడీల ద్వారా గుర్తింపు కార్డు కాపీలు మీ దగ్గర లేకున్నా..మొబైల్ లో ఉండే డిజిటల్ సివిల్ ఐడీలతో ఏ ప్రభుత్వ శాఖలో అయిన పలు దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!