ఒమన్:కారుతో బీచ్ లో ఓవరాక్షన్..డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

- August 23, 2020 , by Maagulf
ఒమన్:కారుతో బీచ్ లో ఓవరాక్షన్..డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

మస్కట్:సరదా కోసం బీచ్ లో ఓ వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. వేగంగా డ్రైవ్ చేయటమే కాకుండా..ప్రమాదకర విన్యాసాలు చేస్తూ తోటి పర్యాటకులను భీతిల్లెలా చేసి చివరికి జైలు పాలయ్యాడు. ఉత్తర బటినా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టైన నిందితుడు సహమ్ విలాయత్ పరిధిలోని బీచ్ లో తన కారును అతివేగంగా డ్రైవ్ చేయటమే కాకుండా విన్యాసాలు చేస్తూ..ఇతరులకు అపాయం కలిగించేలా వ్యవహరించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ప్రమాదకర విన్యాసాలు చక్కర్లు కొట్టడంతో వీడియో ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com