ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి
- August 23, 2020
మస్కట్: ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మాలవత్ పాండ్యా(33)ది నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి. ఒమన్లోని సలాల ప్రాంతంలో ఉన్న అల్ నాసర్ అల్ అరేబియా సంస్థలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.దీంతో శనివారం పాండ్యా కుటుంబ సభ్యులకు ఒమన్ నుంచి అధికారులు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని వారు కోరుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాండ్యా మృతితో రేకులపల్లిలో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?