దోహా:అభివృద్ధి పనులతో 6 నెలల పాటు లులు కూడలి పాక్షికంగా మూసివేత
- August 23, 2020
దోహా:డీ రింగ్ రోడ్డులో భాగమైన లులు జంక్షన్ ను 6 నెలల పాటు పాక్షికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. డీ రింగ్ రోడ్డును ట్రాఫిక్ ఫ్లోకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నందున ఈ అంతరాయం అనివార్యంగా మారిందని వివరించింది. లులు కూడలిలో ఈ నెల 23 నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని..ఈ మేరకు మార్పులను వాహనదారులు గమనించాలని కోరింది. అభివృద్ధి పనుల సమయంలో వాహనాలు వెళ్లాల్సిన దారులకు సంబంధించి ఏర్పాటు చేసిన సైన్ బోర్డులో సూచనలు చేశామని, సూచించిన డైరక్షన్ లో వాహనాలు వెళ్లాలని అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే..మౌళిక సదుపాయల అభివృద్ధిలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ అష్గల్ డీ రింగ్ డెవలప్మెంట్ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







