ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు..
- August 23, 2020
న్యూ ఢిల్లీ: గురుగ్రామ్‌కు చెందిన ట్రావెల్ కంపెనీ అడ్వెంచర్స్ ఓవర్‌ల్యాండ్ ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు నడపనున్నట్లు ప్రకటించింది ఈ బస్పు 18 దేశాల గుండా 70 రోజుల పాటు 20 వేల కి.మీ ప్రయాణిస్తుంది. మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జెర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా బస్సు వెళుతుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, హెల్పర్ ఉంటారు.
ఈ ప్రయాణానికి వెళ్లాలనుకునేవారికి వీసా ఏర్పాట్లు కూడా సదరు కంపెనీయే చూసుకుంటుంది.. అన్ని దేశాల్లో కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రిజిస్ట్రేషన్ చేపడతామని ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ తెలిపారు. ప్రయాణికులకు స్టార్ హోటళ్లలోనే బస కల్పిస్తామని, ఏ దేశంలో ఉన్నా భారతీయ వంటకాలు ఉండేట్లు చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ బస్సు ప్రయాణం వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానుంది. దీని టికెట్ ధర రూ.15 లక్షలు గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?