యూఏఈ: 20-40 ఏళ్ల వారికే ఎక్కువగా కరోనా..నిర్లక్ష్యమే కారణమంటున్న వైద్యులు

- August 23, 2020 , by Maagulf
యూఏఈ: 20-40 ఏళ్ల వారికే ఎక్కువగా కరోనా..నిర్లక్ష్యమే కారణమంటున్న వైద్యులు

యూఏఈలో ఎక్కువగా యువ వయస్కులే కరోనా బారిన పడినట్లు వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. కరోనా బారిన పడిన వారిలో అధికంగా 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారని యూఏఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా వెల్లడించారు. కోవిడ్ 19 వైరస్ యువతపై ఎక్కువగా ప్రభావం చూపదన్న తప్పుడు సూచనల వల్లే ఈ అనర్ధం జరిగినట్లు చెప్పారు. కరోనా నియంత్రణకు సరైన దిశలో అవగాహన కల్పించటం జాతీయ బాధ్యతని, ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా మరింత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం, ప్రజల్లో మరింత చైతన్యం పెంచేలా అవగాహన తీసుకురావాల్సిన అవశ్యత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గత కొన్నాళ్లు వైరస్ వ్యాప్తి రేటు పెరుగుతుందని, భౌతిక దూరం పాటించకపోవటం, ఒకరికొకరు షేక్ హ్యాండ్ చేసుకోవటం, కరోనా ముందస్తు జాగ్రత్తలను పూర్తిగా విస్మరించటమే ఇందుకు కారణమని డాక్టర్ ఫరీదా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు యువతో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో..కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనలను పాటించని వారిపై జరిమానాలు మరింత ఎక్కువగా విధిస్తామని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒమర్ అల్ హమ్మది కూడా స్పదించారు. పౌరులు, ప్రవాసీయులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించటంతో పాటు ఫేస్ మాస్కులు తప్పకుండా ధరించాలని కోరారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com