కువైట్:ఓపెన్ హౌజ్ లో ప్రవాస భారతీయుల సంక్షేమ నిధిపై దృష్టి సారించిన ఇండియన్ ఎంబసీ

- August 24, 2020 , by Maagulf
కువైట్:ఓపెన్ హౌజ్ లో ప్రవాస భారతీయుల సంక్షేమ నిధిపై దృష్టి సారించిన ఇండియన్ ఎంబసీ

కువైట్ సిటీ:కువైట్ లో భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఓపెన్ హౌజ్ లో ఈ వారం ప్రవాసభారతీయుల సంక్షేమ నిధిపై దృష్టి సారించారు. సెలవు రోజుల్లో తప్ప మిగిలిన అన్ని రోజులు ఓపెన్ హౌజ్ ఉండగా..దానికి అదనంగా ఈ నెల 19 నుంచి ప్రతి బుధవారం ప్రత్యేకంగా ఓపెన్ హౌజ్ నిర్వహిస్తున్నారు. ప్రవాస భారతీయుల సాధకబాధలు తెలుసుకొని వారికి అవసరమైన సాంకేతిక సాయం చేసేందుకు వీలుగా ఓపెన్ హౌజ్ సమావేశం అవకాశం కల్పిస్తోంది. కువైట్ లో భారత రాయబారిగా కొత్త నియమించబడిన సిబి జార్జ్ ఓపెన్ హౌజ్ సమావేశాలను పునరుద్ధరించిన తర్వాత..భారత రాయబార కార్యాలయం ఈ సారి బుధవారపు సమావేశంలో కువైట్లోని భారతీయుల సంక్షమ నిధి సమీకరణ దిశగా ప్రయత్నాలు చేయనుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రవాస భారతీయులను ఆదుకునేందుకు ఈ సంక్షేమ నిధిని వినియోగించనున్నారు. ఓపెన్ హౌజ్ సమావేశంలో రాయబార అధికారితో పాటు మిషన్ డిప్యూటీ అధికారి, సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్మిక శాఖలు పాల్గొంటాయి. అయితే..కరోనా నేపథ్యంలో ఓపెన్ హౌజ్ కు పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతిస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్..ఫస్ట్ సర్వీస్ ప్రాతిపాదికన ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారికి ముందుగా అనుమతి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com