దుబాయ్ లో ప్రపంచంలో ఎత్తైన ఫెర్రీస్ వీల్ కు తొలి ప్యాసింజర్ క్యాప్సుల్
- August 24, 2020
దుబాయ్:ఎత్తైన కట్టడాలు, అద్భుత నిర్మాణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న దుబాయ్..ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రీస్ వీల్ ను ఏర్పాటు చేస్తోంది. ఐన్ దుబాయ్ లో ఏర్పాటు చేస్తున్న ఈ వీల్ దాదాపు పూర్తి కావొచ్చింది. వీల్ కు తొలి ప్యాసింజర్ క్యాప్సుల్ ఇటీవలె విజయవంతంగా అమర్చినట్లు ఐన్ దుబాయ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మిగిలిన 47 ప్యాసింజర్ క్యాప్సుల్స్ అమరిక ముందుగా నిర్దేశించుకున్న సమయానికల్లా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ఫెర్రీస్ వీల్ సముద్ర మట్టానికి 250 మీటర్ల ఎత్తులో ఉంటుందని..వీల్ పై నుంచి 360 డిగ్రీల కోణంలో దుబాయ్ అందాలను ఆస్వాదించొచ్చని వివరించారు. న్యూయార్క్ లో ఉన్న 190 మీటర్ల వీల్ ఇప్పటి వరకు అతి ఎత్తైన వీల్ గా నమోదైన రికార్డ్ ను ఐన్ దుబాయ్ లోని ఫెర్రీస్ వీల్ బ్రేక్ చేయనుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన