యూఏఈ లో ఉచిత కరోనా పరీక్షలు...కానీ, ఎవరెవరికి?

- August 24, 2020 , by Maagulf
యూఏఈ లో ఉచిత కరోనా పరీక్షలు...కానీ, ఎవరెవరికి?

యూఏఈ: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో కొన్ని వర్గాలకు ఉచిత పరీక్షలను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. మరి ఆ ఉచిత పరీక్షలు ఎవరెవరికో ఒకసారి చదవండి..

యూఏఈ లోని అబుధాబి ఆరోగ్య శాఖ మరియు దుబాయ్ హెల్త్ అథారిటీ ప్రకారం, ఈ క్రింది వర్గాలు ఉచిత COVID19 పరీక్షకు అర్హులు.

1. ఎమిరాతీ పౌరులు మరియు వారి గృహ కార్మికులు. ఈ విభాగంవారికి రోగ లక్షణాలు ఉన్నా లేకున్నా కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించబడతాయి.
2. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు
3. వికలాంగులు
4. 50 ఏళ్లు పైబడిన నివాసితులు
5. కరోనా లక్షణాలను కలిగివున్న, లేదా కరోనా సోకిన వారితో సంబంధం కలిగిఉన్న నివాసితులు.

వ్యాప్తిని పరిమితం చేయడానికి మరియు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా COVID19 పరీక్ష యొక్క పరిధిని విస్తరించడం ప్రారంభించిందని అబుధాబి ఆరోగ్య శాఖ వెల్లడించింది. పరీక్ష చేయించుకోదలచినవారు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసిన తర్వాత డ్రైవ్-త్రూ పరీక్షా కేంద్రాలకు (అబుధాబి లో) వెళ్లాలని ఆరోగ్య శాఖ నిర్దేశిస్తోంది. అంతేకాకుండా, ఎమిరేట్‌లోని హాట్-స్పాట్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తమ ఇళ్ళవద్దనే పరీక్షలను నిర్వహించేందుకు అబుధాబి పబ్లిక్ హెల్త్ సెంటర్ (ADPHC) మరియు SEHA ద్రుందాలు వస్తాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మీరు నివసించే ఎమిరేట్‌తో సంబంధం లేకుండా యూఏఈ అంతటా ఉచిత పరీక్షల ప్రక్రియ వర్తిస్తుందని ఆరోగ్య శాఖ ధృవీకరించింది.

COVID19 పరీక్షను ఎలా బుక్ చేసుకోవాలి?
అబుధాబి నివాసితులు: అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి ఎస్తిజాబా హాట్‌లైన్‌ 8001717 కు కాల్ చేయాలి.
దుబాయ్ నివాసితులు: దుబాయ్ హెల్త్ అథారిటీ(DHA) తో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి 800342 కు కాల్ చేయాలి. DHA ప్రకారం, లక్షణాలు కనబరుస్తున్న ఎవరికైనా సరే DHA ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఉచిత పరీక్ష పొందుతారు.

DHA ఆసుపత్రుల జాబితా:
1. దుబాయ్ హాస్పిటల్
2. రషీద్ హాస్పిటల్
3. లతీఫా ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్
4. హట్టా ఆసుపత్రి

ఇతర ఎమిరేట్స్ నివాసితులు: ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ హాట్‌లైన్‌ 80011111 నంబర్‌కు కాల్ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com