కరోనా రెండవ దశ..తస్మాత్ జాగ్రత్త..నిబంధనలు పాటించకపోతే అంతే సంగతి..యూఏఈ హెచ్చరిక

- August 24, 2020 , by Maagulf
కరోనా రెండవ దశ..తస్మాత్ జాగ్రత్త..నిబంధనలు పాటించకపోతే అంతే సంగతి..యూఏఈ హెచ్చరిక

యూఏఈ: ప్రపంచం అంతటా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రజలతో దాగుడుమూతలు ఆడుతోంది. తగ్గినట్టే తగ్గి మరలా మనిషిని కాటేస్తోంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది యూఏఈ. కరోనా అదుపులోకి వస్తోంది అని ఊరట చెంది తగిన నిబంధనలతో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టిన యూఏఈ కి పెరుగుతున్న కరోనా కేసులు నిద్రపట్టనివ్వటంలేదు.

కరోనా మహమ్మారి అంతం కాలేదు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి కఠినమైన ముందు జాగ్రత్త చర్యలకు ప్రజలు కట్టుబడి ఉండకపోతే కోవిడ్ -19 వ్యాప్తి యొక్క రెండవ దశ కు యూఏఈ గురయ్యే ప్రమాదం ఉందని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఒబైద్ అల్ హుసాన్ అల్ షంసీ అన్నారు. వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో జాతీయ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టడాన్ని అధికారులు పరిశీలిస్తారని షంసీ తెలిపారు. గత రెండు వారాల్లో అంటువ్యాధుల సంఖ్య పెరిగిన క్రమంలో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం సూచించే నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com