తెలంగాణ లో కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 25, 2020
హైదరాబాద్:తెలంగాణ లో కరోనా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,08,670 కు చేరింది. తాజాగా 9 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 770 కి చేరింది. తాజాగా 1752 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 84,163 కు చేరింది. ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 75.27 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 77.44 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,21,054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!







