మళ్లీ పట్టాలెక్కనున్న దోహా మెట్రో..అతి త్వరలో సర్వీసుల పునరుద్ధరణ
- August 25, 2020
దోహా:కోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్లు నిలిచిపోయిన దోహా మెట్రో..తిరిగి సర్వీసులను ప్రారంభించేందుకు సంసిద్ధం అవుతోంది. అన్ లాక్ నాలుగో దశలో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు సంకేతాలున్నాయి. అయితే..ఏ తేది నుంచి ప్రారంభించబోతున్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తేది ఖరారు కానప్పటికీ మెట్రో సర్వీసులు మళ్లీ పట్టాలెక్కనున్న నేపథ్యంలో దోహా మెట్రో అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలంటూ అవగాహన కల్పించేలా దాదాపు 18 వేల చోట్ల సందేశాలు అమర్చారు. అలాగే ప్రతి స్టేషన్ లో ప్రయాణికుడికి థర్మల్ టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. పలు కీలక ప్రాంతాల్లో దాదాపు 300 శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు