మస్కట్: ప్రమాదకర కాలువను దాటేందుకు దుస్సాహసం చేసిన డ్రైవర్ అరెస్ట్
- August 27, 2020
మస్కట్:ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఓ కాలువను దాటేందుకు ప్రయత్నించిన ఓ డ్రైవర్ ను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమన్ లోని నార్త్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముదైంబి విలాయత్ పరిధిలోని ఓ కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా..ఓ వాహనదారుడు దుస్సాహసం చేసి కాలువ దాటేందుకు వాహనాన్ని తీసుకెళ్లాడని వివరించారు. అతని ప్రాణంతో పాటు తోటివారి ప్రాణాలకు కూడా అపాయం కలిగించేలా వ్యవహరించినందుకు సదరు డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దుస్సాహాసానికి ఒడిగట్టిన డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!