విదేశీ ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
- August 27, 2020
అమరావతి:వందే భారత్ & ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ పేరుతో విమానాలను నడుపుతోంది.
ఈ వందే భారత్ మిషన్ ద్వారానే విదేశాల్లో ఉన్న వారిని సొంత ప్రదేశాలకు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.ఆగస్టు 24వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా 11,82,129 మంది ప్రయాణీకులను రప్పించింది.ఈ నేపథ్యంలో వందే భారత్ మిషన్ & ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల్లో ప్రయాణం చేసే వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసినట్లు ఏపీ కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డా.అర్జా శ్రీకాంత్ తెలిపారు.
విదేశీ ప్రయాణికులకు మార్గదర్శకాలు:
* ప్రయాణానికి ఏ వర్గానికి చెందిన వారు అర్హులు అనేదాన్నికేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.
* విదేశీ ప్రయాణాలకు అర్హులైన వర్గానికి చెందిన వారి జాబితా పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచుతారు.
* అలాంటి వ్యక్తులు అవసరమైన పత్రాలు పౌరవిమానయాన శాఖకు లేదా సంబంధిత అధీకృత ఏజెన్సీకి దరఖాస్తు చేసుకుంటారు
* ప్రయాణం పౌరవిమానయాన శాఖ అనుమతించిన నాన్ షెడ్యూల్డ్ విమానాల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
* విదేశీ ప్రయాణానికి వెళ్లే నౌకలపై పనిచేయాలనుకునే భారత నావికులు, సిబ్బంది తమ యాజమాన్యాలు ఏర్పాటు చేసిన విమానాలు లేదా పౌర విమానయాన శాఖ నడిపే నాన్ షెడ్యూల్డ్ విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది
* ప్రయాణ ఖర్చులను ప్రయాణికులే భరించాలి.
* ప్రయాణికులందరూ థర్మల్ స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరి. ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
* విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బంది, అందరు ప్రయాణికులు మాస్కులు ధరించడంతోపాటు చేతులను పరిశుభ్రంగా ఉంచడం లాంటి నిబంధనలు పాటించడం తప్పనిసరి.
* అన్ని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్స్ ప్రయాణికుల వివరాలు ఆయా విమానయాన సంస్థలు సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఒక కాపీతో సహా సంబంధిత భారత రాయబార కార్యాలయాలకు పంపాలి.
* విదేశాల నుంచి వస్తున్న అన్ని విమానాలు/ నౌకల వివరాలు కనీసం రెండు రోజుల ముందుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆన్లైన్ లో ప్రచురించాల్సి ఉంటుంది.
* ప్రయాణికులందరూ తమ ప్రయాణానికి తామే బాధ్యులమని హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
* విమానాలు, నౌకల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులు అందరూ మాస్కులు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
* దేశ సరిహద్దుల ద్వారా ప్రవేశించే ప్రయాణికులు కూడా ఇదే తరహా నిబంధనలు పాటించాలి.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







