మాస్క్ ధరిస్తేనే విమాన ప్రయాణం-DGCA
- August 28, 2020
న్యూ ఢిల్లీ:కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA).ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేసింది DGCA. ఆ తర్వాత దాన్ని జులై 31 వరకు.. తాజాగా ఆగస్టు 31వరకు పొడిగించింది.
మాస్కు ధరిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తేల్చి చెప్పింది. మాస్క్ ధరించడానికి నిరాకరించిన ఏ ప్రయాణీకుడినైనా విమానయాన సంస్థ నో-ఫ్లై జాబితాలో ఉంచవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.విమానాలలో ప్రీ-ప్యాక్డ్ భోజనం, పానీయలను అందిస్తారు.అంతర్జాతీయ విమానాలలో ఆహారం లేదా పానీయాలను అందిస్తున్నప్పుడు సింగిల్ యూజ్ డిస్పోజబుల్ ట్రేలు, ప్లేట్లు మాత్రమే వాడాలని తెలిపింది.ప్రస్తుత DGCA నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్యలకు ఎయిర్లైన్స్, క్యాబిన్ సబ్బందికి అధికారం ఉందని వెల్లడించారు. ఆహారం ప్రయాణ దూరం బట్టి విమానయాన సంస్థలు అందిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?