చెన్నై సూపర్ కింగ్స్‌లో పలువురికి కరోనా: క్వారంటైన్‌లోకి ధోనీ టీమ్
- August 28, 2020
యూఏఈ: ఐపీఎల్‌లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం రేపింది. అక్కడ నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో కొందరు ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలింది. యూఏఈకి వెళ్లిన జట్టు సభ్యులకు నిబంధనల ప్రకారం.. ఒకటి, మూడు, ఆరో రోజున టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టుల్లో కొంతమంది జట్టు సభ్యులకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో చెన్నై జట్టుకు క్వారంటైన్ పీరియడ్‌ను మళ్లీ పొడిగించారు. సెప్టెంబర్ 1 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్వారంటైన్‌లో ఉండనుంది. బీసీసీఐ ఇప్పటి వరకు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించలేదు. ఇప్పటికే ముందుగా యూఏఈ వెళ్లిన జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?