ఈ 15 జాగ్రత్తలు తీసుకుందాం- కోవిడ్-19పై విజయం సాధిద్దాం

- August 29, 2020 , by Maagulf
ఈ 15 జాగ్రత్తలు తీసుకుందాం- కోవిడ్-19పై విజయం సాధిద్దాం

కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.అదే సమయంలో ప్రజలు కూడా బాధ్యతగా నిత్యం వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలి. మన ఆహార అలవాట్లలోనూ మార్పులు చేసుకుని కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. త్వరలోనే మార్కెట్లో వాక్సిన్లు వచ్చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన 15 జాగ్రత్తలు. 

1) దూరం నుంచే పలకరించుకోండి. వారి యోగ క్షేమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోండి

2) భౌతిక దూరం తప్పక పాటించాలి. ఎదుటి వ్యక్తికి కనీసం ఆరడుగులు లేదా రెండు గజాల దూరంలో ఉండండి

3) బయటకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలి. సర్జికల్ మాస్కులు అయితే ఒకసారి వాడిన మాస్కును తిరిగి ఉపయోగించవద్దు. ఇంట్లోనే తయారు చేసుకుని తిరిగి ఉపయోగించుకోగలిగే కాటన్ మాస్కులను వాడండి.

4) మీ కళ్లు, ముక్కు, నోటిని అనవసరంగా తాకకండి. ఎందుకంటే వీటిద్వారానే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. 

5) శ్వాసకోశ పరిశుభ్రతలను పాటించండి. తుమ్ము, దగ్గు వచ్చినపుడు మీ మోచిని అడ్డుపెట్టుకోండి. లేదా హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించండి. 

6) మీ చేతులను తరచుగా ఆల్కాహాల్ శానిటైజర్ తోగానీ, సబ్బు నీటితో గానీ కనీసం 20 నుంచి 40 సెకన్లపాటు శుభ్రంగా కడుక్కోవాలి.

7) పొగాకు, ఖైనీ, గుట్కా వంటి వాటిని తినవద్దు. బహిరంగంగా ఉమ్మివేయవద్దు. 

8) తరచుగా తాకే వస్తువులు ప్రదేశాలు క్రమం తప్పకుండా క్రిమిసంహారకాలతో శుభ్రం చేయండి. 

9) అనవసరమైన ప్రయాణాలు మానుకోండి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి.

10) ఎక్కువ మంది గుమికూడే ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు వెళ్లకండి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.

11) ఆరోగ్యసేతు మరియు కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోండి.

12) కోవిడ్ బారినపడిన వారిపై గాని, వారికి సంరక్షకులుగా ఉన్న వారిపై గానీ వివక్ష చూపవద్దు.

13) కోవిడ్ పై ఖచ్చితమైన సమాచారం కోసం ప్రభుత్వం నియమించిన అధికారులు, స్థానిక ఆరోగ్య కార్యకర్తలను మాత్రమే సంప్రదించండి. 

14) ఒకవేళ జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే 104 నంబర్ కు ఫోన్ చేయండి

15) మానసికంగా ఒత్తిడి, ఆందోళనకు గురైతే అవసరమైన  సలహా లేదా సాయం కోసం ప్రభుత్వం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ 104 కి కాల్ చేయండి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com